కిడ్నీస్... ఫర్ సేల్....

ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసుతో సంబంధం ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు పోలీస్ అధికారులుగుంటూరు జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నీ మార్పిడి రాకెట్‌పై గుంటూరు పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్‌లు 370, 470, 465, 466, 468, 471, 120(బి)తోపాటు మానవ అవయవాల మార్పిడి చట్టంలోని సెక్షన్‌ 18, 19, 20 కింద కేసు నమోదు చేశారు.

కిడ్నీస్... ఫర్ సేల్....

గుంటూరు, జూలై 18 :
గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నీలా.. ఇడ్లీలా? 30 రూపాయలకు ప్లేట్‌ ఇడ్లీ అన్నంత ఈజీగా 30లక్షలకు ఓ కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాలను క్యాష్‌ చేసుకుంటున్నారు. బాధితులను నిందితులుగా చేస్తోన్న నయవంచన ఇప్పుడు మరో లెవల్‌.

ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసుతో సంబంధం ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు పోలీస్ అధికారులుగుంటూరు జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నీ మార్పిడి రాకెట్‌పై గుంటూరు పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్‌లు 370, 470, 465, 466, 468, 471, 120(బి)తోపాటు మానవ అవయవాల మార్పిడి చట్టంలోని సెక్షన్‌ 18, 19, 20 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు బాషా, సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు పోలీసులు. మరో ముగ్గురి కోసం గాలిస్తు్న్నట్లు పోలీసులు చెప్పారు.

Read More పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం

మరోవైపు ఈ రాకెట్‌ను సీరియస్‌గా తీసుకున్న హోంమంత్రి వి అనిత గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్‌తో పాటు గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమగ్ర విచారణ జరిపి అందులో ప్రమేయం ఉన్న వారందరినీ పట్టుకోవాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన గుంటూరు నగరంపాలెం పోలీసులు.. విచారణ అనంతరం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో‌ మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్ముకున్నాడు.

Read More జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు

అయితే, డాక్టర్లు, మధ్యవర్తి, కిడ్నీ గ్రహిత తనను దారుణంగా మోసం చేశారని.. రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి లక్ష కూడా ఇవ్వలేదని బాధితుడు మధుబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడి వైపు కిడ్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తనకు న్యాయం కావాలని అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటనపై అటు ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్పెషల్ టీమ్స్‌తో విచారణను వేగవంతం చేశారు. మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, దీని వెనుక ఎవరెవరూ ఉన్నారో తేలుస్తామని చెప్పారు డీఎస్పీ మహేష్.

Read More విభజన సమస్యలు కొలిక్కివచ్చేనా....

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన