పాదయాత్రకు సిద్ధమౌతున్న షర్మిళ

పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దూకుడుగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కంటే.. వైసిపి ఓటమికి ఎక్కువగా పని చేశారు. తాను అనుకున్నది సాధించారు. జగన్ ను గద్దె దించాలని లక్ష్యంతో పనిచేసిన ఆమె సక్సెస్ అయ్యారు. వైసీపీ ఓటమితోనే పార్టీ క్యాడర్ తో పాటు నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు పాదయాత్ర చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన చేంజ్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

పాదయాత్రకు సిద్ధమౌతున్న షర్మిళ

విజయవాడ, ఆగస్టు 6 :
వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తారా? రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధపడ్డారా? ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారా? మూడు విడతల్లో చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దూకుడుగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కంటే.. వైసిపి ఓటమికి ఎక్కువగా పని చేశారు.

తాను అనుకున్నది సాధించారు. జగన్ ను గద్దె దించాలని లక్ష్యంతో పనిచేసిన ఆమె సక్సెస్ అయ్యారు. వైసీపీ ఓటమితోనే పార్టీ క్యాడర్ తో పాటు నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు పాదయాత్ర చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన చేంజ్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. వైసీపీకి ఘోర పరాజయంతో జగన్ రాష్ట్రంలో ఉండేందుకు కూడా ఇష్టపడడం లేదు. వైసీపీ సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు సైతం జగన్ కు దూరంగా జరుగుతున్నారు. ఇటువంటి తరుణంలో పాదయాత్ర చేస్తే ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకోవడంతోపాటు వైసిపి క్యాడర్ను కాంగ్రెస్ వైపు మళ్లించవచ్చని భావిస్తున్నారు షర్మిల. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం పనిచేసింది. వైసిపి ఓడిపోయింది.

Read More ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వాగతం పలికిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల 

కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా ఇదే. అందుకే వైసిపి నేతలను ఆకర్షించే పనిలో పడింది కాంగ్రెస్. అందుకే షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో.. మూడు విడతల్లో పాదయాత్ర చేసేందుకు షర్మిల సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటకముందే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.తెలుగు నాట పాదయాత్ర చేసిన ఏ నేత ఫెయిల్ కాలేదు. 2003లో సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. తాను సీఎం కావడమే కాదు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీలను గెలిపించి ఇచ్చారు. అటు తరువాత చంద్రబాబు పాదయాత్ర చేశారు అధికారంలోకి వచ్చారు. జగన్ పాదయాత్ర చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నారు. అయితే 2013లో షర్మిల పాదయాత్ర చేశారు.

Read More పరవాడ గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం 

అన్న జగన్ జైలులో ఉండడంతో ఆయన తరుపున ఉమ్మడి రాష్ట్రంలో నడిచారు. కానీ వైసీపీని అధికారంలోకి తేలేకపోయారు.వైసీపీ నాయకులు పార్టీ నాయకత్వం పై అసంతృప్తితో ఉన్నారు. జగన్ వైఖరి నచ్చని చాలామంది సీనియర్లు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. మరికొందరు కూటమి పార్టీల్లో చేరాలనుకున్నా ఆహ్వానం లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి మంచి స్థితిలోకి వస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీ పై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టింది. వైసీపీలో ఉన్న నాయకులు, క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీ దే వారు తిరిగి పార్టీలో చేరితే పూర్వ వైభవం ఖాయం. ఇప్పుడు గానీ షర్మిల తో పాదయాత్ర చేస్తే వైసిపి క్యాడర్ చీలి పోతుందని కాంగ్రెస్ పార్టీ అంచనాకు వచ్చింది.

Read More చంద్రబాబుకు "సొంత" కుంపటి

షర్మిల తన పాదయాత్రను మూడు విడతల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో.. మూడు విడుదలగా పాదయాత్ర చేసి సుదీర్ఘకాలం పాటు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా తన కుటుంబంలో కలిసి వచ్చిన పాదయాత్ర సెంటిమెంట్ను.. తాను సైతం అనుసరించేలా వ్యూహం పన్నుతున్నారు. అయితే ఇప్పటికే హై కమాండ్ కు సమాచారం అందించాలని.. అటు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి నాటికే పాదయాత్ర పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read More భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా