మేడిపల్లి ఎమ్మార్వో నిర్లక్ష్యంపై "దళిత మహిళ"నిరసన
బోడుప్పల్ దేవేందర్ నగర్ ఫేస్-2 తన ప్లాట్ కబ్జా పై ఫిర్యాదు
ఎమ్మార్వో ఆఫీస్ ముందు న్యాయం కోసం బైఠాయించిన దళిత మహిళ
ఎమ్మార్వో ఆదేశాలను ధిక్కరించిన రెవెన్యూ అధికారులు
తూతూ మంత్రంగా కూల్చివేతలు
అక్రమార్కులకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రెవెన్యూ సిబ్బంది
జయభేరి, మేడిపల్లి : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల దేవేందర్ నగర్ ఫేజ్ -2 సర్వే నెంబర్ 63/1 లో గలప్లాట్ నెంబర్ 700పి కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నారని, ఆ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని అంబాల మహాలక్ష్మి అనే నిరుపేద దళిత మహిళ గత 2 వారాల క్రితం ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసిన కానీ శ్యూనం. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ ఎన్ని మార్లు తిరిగి తన గోడును పదేపదే ఎమ్మార్వో కి విన్నవించిన అక్రమ నిర్మాణం పై రెవెన్యూ అధికారుల చర్యలు మాత్రం శూన్యం. దీంతో చేసేదేమీ లేక ఎమ్మార్వో హసీనా నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు.
ఇంకా రాత్రి సమయాల్లో నిర్మాణాన్ని కొనసాగించడం చాలా బాధాకరమని, కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ అన్యాయంగా ఇతరులు కబ్జా చేస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద దళిత కుటుంబం అని తెలిసి కూడా కబ్జాదారుల నుండి ముడుపులు తీసుకొని రెవెన్యూ అధికారులు తమ ఫిర్యాదును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు స్పందించిన రెవెన్యూ అధికారులు తూతు మంత్రంగా కూల్చివేసి చేతులు దులుపుకున్నారు.
అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని మీడియా సాక్షిగా బాధితులకు ఎమ్మార్వో హామీ ఇస్తే ..కిందిస్థాయి రెవెన్యూ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఎమ్మార్వో ఆదేశాలను ధిక్కరిస్తూ కూల్చివేతల సమాచారాన్ని కబ్జాదారులకు తెలియపరచడం, కేవలం ఐదు నిమిషాల్లో ఇంట్లో మనుషులు ఉన్నట్టు మంచం, బట్టలు తదితర వస్తువులు సర్దడం.. ఇంట్లో మనుషులు ఉన్నారంటూ రెవెన్యూ సిబ్బంది బాధితుల గోడు వినకుండానే వెళ్లడం కోసం మెరుపు.తమకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ కు,ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Post Comment