వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం

మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 
జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం,
రాష్ట్ర అధ్యక్షులు కాల జంగయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంగక్క పాల్గొన్నారు. వికలాంగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కోమ్ముహరికుమార్ ఆధ్వర్యంలో గాంధీ పార్కులో  నిర్వహించిన సమావేశంలో కోర్ కమిటీ వైస్ చైర్మన్ అంతే రాంబాబు మాట్లాడుతూ... నియోజికవర్గంలో వికలాంగుల పింఛన్లు బలోపేతం చేయడం గురించి 4016 నుండి 6016కు పెంపు గురించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు పై చేస్తున్న మొండి వైఖరి  రేవంత్ రెడ్డి సర్కారు దొంగ మాటలు చెప్పి అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పింఛన్ల పైన మాట ఇచ్చి వికలాంగుల పింఛన్లు పెంచకుండా మాటలు చెప్పుతూ కాలం గడుపుతున్నరని అన్నారు.

Read More అటానమస్ వల్ల సలహాలు సూచనలు కావాలి...

రానున్న రోజులలో వికలాంగులు, వితంతువులు ఒంటరి మహిళలు, వృద్ధులు, కలుపుకొని పతి గ్రామం నుండి వందలాది మందిని కూడగట్టుకుని రేపు జరగబోయే నవంబర్ 26 చలో హైదరాబాద్కు తరలించి పింఛన్లపై  పైన రేవంత్ రెడ్డి సర్కార్ తోటి తాడు పేడు తెలుసుకోవడానికి   రేవంత్ రెడ్డి సర్కార్ పైన యుద్ధం ప్రకటించడం జరుగుతుందని అన్నారు. మిర్యాలగూడ నియోజికవర్గం సదస్సు సెప్టెంబర్ 8 ఆదివారం రోజు న జరగబోయే కార్యక్రమానికి జిల్లా కమిటీ ప్రమోట్ గా మేక నాగరాజు,నియోజికవర్గ ఇన్చార్జిలను ప్రకటించడం జరిగింది.

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

నియోజికవర్గ ఇన్చార్జి పాల్వాయి సుధాకర్,
తాళ్లపల్లిసురేష్, జి మదన్, దర్శనం సైదులు, కనక శ్రీనివాస్,  నియమించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి  నాయకులు పుట్టల నాగరాజు, నల్లగొండ జిల్లా కో కన్నీరు వీరబోయిన సైదులు,  తవుల వెంకన్న, మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి, 
సీనియర్ నాయకులు రెడ్డి మాస్, ఇందిరమ్మ, మిర్యాలగూడ నియోజికవర్గ ముఖ్యులు 
శంకర్, కాసిం, మంగమ్మ, వాలి, లక్ష్మి, రమణమ్మ,  కవిత, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Read More భారత్ ఖాదీ క్యాలండర్ ఆవిష్కరించిన ఎన్ సీ సంతోష్