రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతుల ధర్నా...

రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

రుణమాఫీపై రైతులకు ధోకా చేసిన కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపాలిటీలోని రైతు సహకార సంఘం బ్యాంక్ ఎదురుగా రైతులతో కలిసి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

IMG-20240822-WA1499

Read More చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, పీర్జాదిగూడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఘట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి,మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకెని బిక్షపతి గౌడ్, జావీద్ ఖాన్, వరికల శ్రీనివాస్,కిరణ్ నాయక్, కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు