కుక్క కాటు బాధితులను పరామర్శ

మెరుగైన వైద్య చికిత్స అందించాలి... రమావత్ రమేష్ నాయక్

కుక్క కాటు బాధితులను పరామర్శ

నేరేడుగొమ్ము : నేరేడు గోమ్ము  మండలం పలుగు తండలో ఉన్న చిన్నారుల పైన,  గ్రామస్తులపైన  కుక్కలు విపరీతంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి 6 గురిని దేవరకొండ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో చేరడం జరిగింది విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ బి. మంగ్త నాయక్ తో మాట్లాడి  మెరుగైన వైద్య సేవలు  అందించాలని అన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించారు.

అనంతరం రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కుక్కల దాడిలో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు గాయాల పాలవుతున్న, పలు చోట్ల మరణిస్తున్న ఈ ప్రభుత్వం కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని,ప్రభుత్వ వెంటనే స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి  కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Read More ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ