బీరప్పకు బోనమెత్తిన దేవేందర్ నగర్ కురుమలు...
మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, నగర మేయర్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కార్పొరేటర్ బోమ్మక్ కళ్యాణ్ కుమార్, నాయకుడు దానగళ్ళ యాదగిరి
మేడిపల్లి, ఆగష్టు 18: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ బీరప్ప స్వామికి బోనాలు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలకు కురుమ సంఘం ఆహ్వానం మేరకు టి పిసిసి ఉపాధ్యక్షుడు,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్,నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కార్పొరేటర్ బోమ్మక్ కళ్యాణ్ కుమార్,సీనియర్ నాయకులు దానగళ్ళ యాదగిరి,పులకండ్ల జంగారెడ్డి పాల్గొని బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీరప్ప స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దేవేందర్ నగర్ కాలనీ బీరప్ప స్వామి దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ వాసురి రాము,సారి కురుమ సానికె శశి,కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నె ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి మరాటి మల్లేష్,కోశాధికారి బండ బీరప్ప,మల్ల కృష్ణ,జోగు మల్లయ్య,బెల్లంపూరి మధు,మరాటి మత్స్యగిరి, జెన్నె రాజు,వాసురి యాదగిరి, జోగు సుధాకర్,వాసురి యాదగిరి,దయ్యాల మహేష్,సిద్దులు,కాటం స్వామి,మల్లేష్,సోమన్న,రవి, కురుమ సంఘం నాయకులు,భుక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Post Comment