శ్రీ విష్ణు, శివాలయంలో అన్నదాన కార్యక్రమం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం
జయభేరి, ఆగస్టు 24:- మూడుచింతల పల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో గల పురాతనమైన అక్కన్న మాదన్న కాలం నాటి శ్రీ విష్ణు , శివాలయంలో శ్రావణ శనివారం సంధర్బంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామానికి చెందిన సింగిరెడ్డి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అల్వాల్ ప్రాంతానికి చెందిన ఇషాన్ సోడా వారి కుటుంబ సభ్యులతో కలసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
Latest News
మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి
12 Jan 2025 22:00:59
జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర...
Post Comment