ఎస్సీ వర్గీరణను నిరసిస్తూ మాల మహానాడు అధ్వర్యంలో నిరసన

ఎస్సీ వర్గీరణ రాజ్యాంగ విరుద్ధం - మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మోహన్ కృష్ణ

ఎస్సీ వర్గీరణను నిరసిస్తూ మాల మహానాడు అధ్వర్యంలో నిరసన

జయభేరి, ఆగస్టు 21:- ఎస్సి వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు అద్యక్షుడు జి చెన్నయ్య  పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ తీర్పును ఉపసంహరించుకోవాలనీ వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు జాంగిర్, ప్రవీణ్, రవి, శ్యాము, సతీష్, హేమంత్, నవీన్, గోవర్ధన్, కృష్ణ మాల  సోదరులు పాల్గొన్నారు.

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం