సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన 

సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన 

దేవరకొండ : ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, వైద్యులకు రక్షణ చట్టం కల్పించాలని, బాధిత కుటుంబానికి  న్యాయం చేయాలని దేవరకొండ సుశ్రుత  గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు మళ్లీపెద్ది సత్యనారాయణ అన్నారు.

కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ  బుధవారం పట్టణంలోని మీనాక్షి సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వాలు స్పందించకుంటే  అన్ని సంఘాలు రోడెక్కి ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్,వెంకటేష్, బిక్షపతి,రత్నాకర్ రావు,మల్లేష్, బాబా పాల్గొన్నారు.

Read More BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు