సెంట్ క్లరేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన యుక్త కంపెనీ చైర్మన్ శ్రేయాస్ బర్మేచ

సెంట్ క్లరేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన యుక్త కంపెనీ చైర్మన్ శ్రేయాస్ బర్మేచ

మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు బాసు రేగడి లో ఉన్న సెంట్ క్లారెట్ స్కూల్ లో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం అందించాలని యుక్త  కంపెనీ యాజమాన్యని బాసర గడి కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సుధాకర్ కోరినట్లు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించిన యుక్త కంపెనీ యాజమాన్యం 52 మంది విద్యార్థులకు 1,17,000/- వేల రూపాయలను స్కూల్ యాజమాన్యానికి పిల్లల చదువుల కొరకు అందచేయడం జరిగిందని మరేపల్లి సుధాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో యుక్త కంపెనీ చైర్మన్ శ్రేయాస్ బర్మెచ్చ, స్కూలు ప్రిన్సిపల్ బెన్ని ఫాదర్,
 కో ఆప్షన్స్ సభ్యులు చిన్నపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సుధాకర్, పెంటారెడ్డి, రాయప్ప రెడ్డి, మాచేర్ల ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్