వక్ఫ్ స్థలాల సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి..

మహబూబ్‌నగర్ ఎంపీ, జేపీసీ సభ్యురాలు డీకే అరుణను కలిసిన బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ బృందం

వక్ఫ్ స్థలాల సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ సర్వె నవంబర్లలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములకు పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతూ మంగళవారం నాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు డీకే అరుణను కలసి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వక్ఫ్ బోర్డు భూ సమస్యకు పరిష్కారం చూపేందుకు గాను జేపీసీ దృష్టికి తీసుకెళ్ళాలని బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ కోరడం జరిగింది.పట్ట భూములను లే అవుట్ చేసి అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటి స్థలాలు కూడా అర్దంతరంగా వక్ఫ్ బోర్డు భుమి అంటూ క్రయవిక్రయాలు నిలిపిన విషయాన్ని అమే దృష్టికి పోవడంతో పాటు, వక్ఫ్ స్థలం కాదనే రుజువులను అందచేయాడం జరిగింది. ఏలాంటి ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన విషయం ఎంపీ దృష్టికి తీసుకుపోయారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ ప్రదాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, జేఏసీ నేతలు శ్రీధర్ రెడ్డి, ధనుంజయ్, కులకర్ణి, పవన్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటరి జాయింట్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళి సమస్యకు పరిష్కారం చూపాలని‌ కోరాడం జరిగింది.

Read More ఉర్దూ భాషా ప్రచారం ను వేగవంతం చేయాలి, భావి తరాలకు రోజు రెండు గంటలు బోధించాలి...

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన