భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ పట్టించుకోవడంలేదు.. కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని.. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసిందని కేటీఆర్ మండిపడ్డారు. డెంగ్యూ సహా విజృంభిస్తున్న విష జ్వరాలతో జనం పరేషాన్ అవుతున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద నివారించడంలో సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గాడితప్పుతున్న ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి సమీక్షలేవి?, ఢిల్లీకి 20 సార్లు వెళ్లే తీరికుంది కానీ.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదా? అని కేటీఆర్ నిలదీశారు.
చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రజల ప్రాణలంటే అంతే లెక్కలేనితనమా? అని అడిగారు. వెంటనే విష జ్వరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Post Comment