నాగచైతన్య - శోభిత రిలేషన్ పై స్పందించిన సమంత
- ఇటీవల నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్లపై పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని, చైతన్య అప్పుడప్పుడు కట్టుకున్న కొత్త ఇంటికి శోభిత వెళ్తోందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని రకరకాల రూమర్స్ వచ్చాయి.
ఏమాయ కలవే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. నాగ చైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడం అన్నీ అలానే జరిగాయి. సమంత కొన్ని సందర్భాల్లో నాగ చైతన్యపై పరోక్ష వ్యాఖ్యలు చేసినా నాగ చైతన్య మాత్రం సమంత గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ క్యూట్ లేడీ లేటెస్ట్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మీరు మీ వృషభరాశిని ఎప్పటికీ కోల్పోరు" అని ఒక కోట్‌ను పంచుకున్నారు. సమంతా వృషభరాశి. ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదని అర్థం. అనే విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్లపై పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని, చైతన్య అప్పుడప్పుడు కట్టుకున్న కొత్త ఇంటికి శోభిత వెళ్తోందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని రకరకాల రూమర్స్ వచ్చాయి.
సరిగ్గా ఇలాంటి సమయంలో సమంత చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. చైతూ, శోభిత రూమర్లపై సమంత పరోక్షంగా స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు. సామ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం కథలు వింటోంది. వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. అట్లీ-అల్లు అర్జున్ త్వరలో చేయబోయే సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థలో మ ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
Post Comment