కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా..?

వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారంపై ఆమె స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే ఖచ్చితంగా స్వాగతిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. వైసీపీ చీఫ్ తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమంటూ షర్మిల అన్నారు.

కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా..?

విజయవాడ, ఆగస్టు 16 :
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనానికి సంబంధించి ఆమె మాట్లాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారంపై ఆమె స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే ఖచ్చితంగా స్వాగతిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. వైసీపీ చీఫ్ తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమంటూ షర్మిల అన్నారు. ఏపీలో జగన్ తిరిగి అధికారంలోకి రాబోరంటూ ఆమె జోస్యం చెప్పారు.

Read More జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు

విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమంటూ ఆమె జగన్ కు సెటైర్ వేశారు.ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నగర మేయర్ పాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నాయుడు పాలెంలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

Read More కడప జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డా...